Friday, April 26, 2024

కొత్త ఆలోచన… ఫేస్ మాస్కులతో గౌన్ కుట్టించుకున్న యువతి

పెళ్లి బట్టలు ప్రత్యేకంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకోసం సూటు, షేర్వానీ, కుర్తా, గౌను, చీర, హాఫ్ శారీ.. ఇలా రకరకాల బట్టలతో వధూవరులు తయారవుతారు. కానీ యూకేకు చెందిన వెడ్డింగ్ ప్లానర్ మార్కెటర్ హిచ్డ్ వాడి పడేసిన ఫేస్ మాస్కులతో వెడ్డింగ్ గౌన్ రూపొందించి ధరించింది. దీంతో ఫ్యాషన్ ప్రియులు ఆమెను ప్రశంసిస్తున్నారు. అయితే వాడి పడేసిన మాస్కులతో కరోనా వైరస్ రాదా అన్నదే మీ సందేహం కదా.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయడంతో యూకే ప్రజలు ఫ్రీడమ్ డేను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జోరుగా పెళ్లిళ్లు, ఫంక్షన్‌లు జరుగుతున్నాయి. అయితే కరోనా తగ్గిపోవడంతో ప్రజలు ఎక్కడ పడితే అక్కడ మాస్కులను వాడి పడేస్తున్నారు. యూకేలో వారానికి 100 మిలియన్‌ల డిస్పోజబుల్ మాస్కులను ప్రజలు రోడ్డుపై పడేస్తున్నారు. దీంతో పర్యావరణానికి హాని కలుగుతుందని భావించిన వెడ్డింగ్ ప్లానర్ మార్కెటర్ హిచ్డ్ అద్భుత ఆలోచనను చేసింది. 1500 ఫేస్ మాస్కులను రీ సైక్లింగ్ చేసి వెడ్డింగ్ డ్రస్ తయారుచేసింది. ప్రముఖ టీవీ, కాస్ట్యూమ్ డిజైనర్ టామ్ సిల్వర్ వుడ్ ఈ గౌనును డిజైన్ చేశారు. కాగా నెటిజన్‌లను ఈ డ్రస్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ వార్త కూడా చదవండి: పార్లమెంట్‌లో ఎంపీలను పరుగులు పెట్టించిన ఎలుక

Advertisement

తాజా వార్తలు

Advertisement