Saturday, July 24, 2021

పార్లమెంట్‌లో ఎంపీలను పరుగులు పెట్టించిన ఎలుక

సాధారణంగా పార్ల‌మెంట్ అంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది. కానీ పార్ల‌మెంట్‌కు వ‌చ్చిన ఎంపీలంతా ఉరుకులు ప‌రుగులు పెడుతుంటే అంతా ఏదో అనుకున్నారు. ఎవ‌రైనా దాడి చేస్తున్నారేమో అని భ‌య‌ప‌డ్డారు. కానీ ఎంపీల‌ను ఉరికించింది ఓ ఎలుక మాత్ర‌మే అని తెలిసి త‌ర్వాత న‌వ్వుకున్నారు. మరి పార్ల‌మెంట్‌లో ఎలుక చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

స్పెయిన్‌ పార్ల‌మెంట్‌లో బుధవారం ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. స‌భ్యులంతా సీరియ‌స్‌గా ఓ అంశంపై ఓటింగ్‌కు రెడీ అవుతుండ‌గా ఎలుక అంద‌ర్నీ ప‌రుగులు పెట్టించింది. దీనికి సంబంధించి ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ వార్తా సంస్థ రాయిట‌ర్స్ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేసింది.

ఈ వార్త కూడా చదవండి: ‘RRR’లో ఎన్టీఆర్ ముస్లిం టోపీ ఎందుకు ధరించాడో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News