Monday, May 20, 2024

డొనెట్స్క్​లో ఉక్రెయిన్​ క్షిపణి దాడి : 20మంది మృతి

ఉక్రెయిన్ వ‌ర్సెస్ ర‌ష్యా యుద్దం కొన‌సాగుతోంది. గ‌త 20 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీవ్​, మైకొలేవ్​, ఖర్కివ్​, ఖేర్సన్​ సహా పలు ప్రధాన నగరాలపై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. చెర్నిహైవ్​ నగరం.. మూడు శక్తిమంతమైన దాడులతో దద్దరిల్లింది. కీవ్​లో సరకు రవాణా విమానాలు తయారుచేసే పరిశ్రమపై దాడి జరిగింది. మరోవైపు.. డొనెట్స్క్​లో ఉక్రెయిన్​ క్షిపణి దాడి జరపగా.. 20 మంది చనిపోయారు. మరో 28 మంది గాయపడ్డారు. డొన్​బాస్​లో ఇరు వర్గాల మధ్య భీకర దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్​ ఆర్మీ ప్రకారం.. 100 మందికిపైగా రష్యా సైనికులు మరణించారు. ఆరు వాహనాలు ధ్వంసమైనట్లు కీవ్​ ఇండిపెండెంట్​ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement