Saturday, April 27, 2024

ఉక్రెయిన్ లో ఎన్నో సినిమాల షూటింగ్స్ – ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కూడా జ‌రిగింది

ర‌ష్యా దాడితో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. ఉక్రెయిన్ మ‌న‌కు తెలియ‌క‌పోయినా ..మ‌నం చూసే ప‌లు చిత్రాల్లో అంద‌మైన దృశ్యాల‌కు నిల‌యంగా మారింది ఉక్రెయిన్. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ ని ఉక్రెయిన్ లో కూడా జ‌రిపారు. భారత స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన కల్పిత పాత్రల చిత్రీకరణ అక్కడే జరిగింది. ఇందుకోసం గతేడాది ఆగస్ట్ 3న ఆర్ఆర్ఆర్ మూవీ బృందం ఉక్రెయిన్ కు వెళ్లారు.. ఆస్కార్ అవార్డు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వయంగా రాసి, తీసిన ’99’ సాంగ్స్ చిత్రీకరణ కూడా ఉక్రెయిన్ లో జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, అమీ జాక్సన్ డ్యుయట్ సాంగ్ ‘రోజా కాదల్’ను ఉక్రెయిన్ లోని టన్నెల్ ఆఫ్ లవ్ వద్ద చిత్రీకరించారు. దీనికి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. 2019లో వచ్చిన రొమాంటిక్, యాక్షన్ ఆధారిత దేవ్ అనే తమిళ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను ఉక్రెయిన్ లో తీశారు. కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో నటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు ప్రధాన తారాగణంతో తీసిన ‘విన్నర్’ అనే తెలుగు సినిమా చిత్రీకరణ కూడా ఉక్రెయిన్ లో జరిగింది. ఇవి కొన్ని మాత్రమే. భారత్ తోపాటు హాలీవుడ్ సినిమాలకు ఉక్రెయిన్ కేరాఫ్ అడ్రస్ గా ఉంది. అటువంటి సుంద‌ర దేశం నేడు బాంబుల మోత‌తో మారు మ్రోగ‌డం విషాద‌క‌రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement