Friday, May 10, 2024

గుర్తు తెలియని చిన్నారి మృతదేహం లభ్యం

పెళ్లకూరు: కన్నవాళ్లకు ఆడపిల్ల భారమైందో.. మరి ఇతర కారణాలకు బలైపోయినదో.. కారణం ఏదైనా.. అభం శుభం తెలియని 9నెలల చిన్నారి నిర్జీవమై చెరువు కట్ట ముళ్ళ పొదల్లో కంటబడింది. స్థానిక ఎస్సై మనోజ్ కుమార్ అందించిన వివరాల మేరకు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పునబాక చెరువుకట్టపై గురువారం గుర్తు తెలియని చిన్నారి మృతదేహం ఉన్నట్లు స్థానిక ఎస్ఐ మనోజ్ కుమార్ కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై మృతదేహాన్ని పరిశీలించారు. పాపకు సంభందించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement