Tuesday, November 29, 2022

Breaking: మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద కార్యకర్తల ఆందోళన.. మోదీ దిష్టిబొమ్మ ద‌హ‌నం

మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మల్లారెడ్డి నివాసాల్లో ఇవ్వాల ఉద‌యం నుంచి జరుగుతున్న ఐటీ సోదాలకు నిరసన తెలుపుతున్నారు. మల్లారెడ్డికి మద్దతు తెలుపుతూ… కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్ర‌ధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోదీ దిష్ట‌బొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. అయితే.. కార్యకర్తలను లోపలికి రానీయ‌కుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

- Advertisement -
   

సంతోష్ రెడ్డి ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం
మల్లారెడ్డి సన్నిహితుడు సంతోష్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. సంతోష్ రెడ్డి ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగిస్తున్నాయి. అక్క‌డ దొరికిన కీలక పత్రాలు తీసుకుని దూలపల్లిలోని అశోక అలమైసన్ 135 విల్లాలో నివాసం ఉంటున్న ప్రవీణ్ రెడ్డి ఇంటికి అధికారులు వెళ్లిన‌ట్టు స‌మాచారం. ప్రవీణ్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు జ‌రుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement