Saturday, November 26, 2022

ఎమ్మెల్యేల కేసులో బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు నోటీసులు.. క‌న్నీరుపెట్టుకున్న బండి సంజ‌య్‌ (వీడియో)

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు నోటీసులు ఇవ్వ‌డంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ క‌న్నీరుపెట్టుకున్నారు. ఇవ్వాల హైదరాబాద్​లో జరిగిన పార్టీ కోర్​ కమిటీ భేటీలో మాట్లాడారు. తమ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ కు సిట్ నోటిసులివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎల్ సంతోష్ జోలికి వస్తే సహించేదే లేదన్నారు. సంతోష్ కి ఫామ్ హౌజ్ లు, బ్యాంక్ అకౌంట్లు లేవన్నారు. కోన్‌కిస్కా గొట్టంగాడు.. ఎవరో ఏదో మాట్లాడితే బీఎల్ సంతోష్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు బండి సంజ‌య్‌. బీఎల్ సంతోష్ దేశం కోసం పనిచేసే వ్యక్తి అని, ఎంపీ, ఎమ్మెల్యే కావాలని ఆయన కోరుకోలేదన్నారు బండి సంజ‌య్‌. ప్రచారకుల జోలికి వస్తే బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చ‌రించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement