Friday, April 26, 2024

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు జైలు శిక్ష

ప్రభుత్వ చీఫ్‌ విప్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు నాంపల్లి స్పెషల్‌ కోర్టు జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఖాజీపేటలో రైల్‌ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి ఆయనపై నేరం రుజువైనట్లు కోర్టు తెలిపింది. అదే విధంగా ఈ కేసులో ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ సహా 18 మందికి కోర్టు రూ.3 వేలు జరిమానా విధించింది. కాగా దాస్యం వినయ్‌ భాస్కర్‌ అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

టీఆర్‌ఎస్‌ తరఫున దాస్యం వినయ్‌భాస్కర్‌ ప్రస్తుతం పశ్చిమ వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2011, ఏప్రిల్ 14న ఖాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న కన్యాకుమారి ఎక్స్‌‌ప్రెస్‌ను టీఆర్ఎస్, బీజేపీ నేతలు నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు రైలు ఆపితే.. దాదాపు 12 గంటలపాటు అక్కడే ఆపేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైల్వేశాఖ ఆందోళనకారులపై హైజాక్ కేసు పెట్టింది. ఈ కేసులో రైల్ రోకోను ముందుండి నడిపించిన ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ ఏ1 నిందితుడిగా ఉన్నారు.

ఈ వార్త కూడా చదవండి: డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా పాజిటివ్

Advertisement

తాజా వార్తలు

Advertisement