Saturday, April 27, 2024

Wrestlers | ఇది చాలా దారుణం.. క్రీడా లోకానికే అవమానం: ఇంటర్నేషనల్​ ఒలింపిక్​ కమిటీ

తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న భారత రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు అనుసరించిన తీరుపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) మండిపడింది. నిరసన తెలిపిన భారతీయ రెజ్లర్లపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించింది. ఇది “చాలా డిస్టర్బింగ్​” గా ఉంది అని తీవ్ర పదాలతో ఓ ప్రకటన జారీ చేసింది. జంతర్ మంతర్ వద్ద తమ నిరసన సమయంలో రెజ్లర్లను నిర్బంధించడంపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) కూడా తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్​ ఒలింపిక్​ కమిటీ స్పందిస్తూ.. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది.

భారత టాప్​లెవల్​ రెజ్లర్లు అయిన- సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సంగీతా ఫోగట్ -రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగికదాడిపై ఆరోపించారు. భారత రెజ్లింగ్ అథ్లెట్ల పట్ల వ్యవహరించిన తీరు చాలా కలవరపెట్టిందని, రెజ్లర్ల ఆరోపణలను స్థానిక చట్టానికి అనుగుణంగా నిష్పాక్షికమైన, నేర విచారణ చేపట్టాలని IOC పట్టుబట్టింది. ఈ ప్రక్రియ అంతటా అథ్లెట్ల భద్రత, శ్రేయస్సును సముచితంగా పరిగణించాలని, ఈ దర్యాప్తును త్వరగా ముగించాలని తాము కోరుతున్నామని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement