Sunday, May 12, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధర 22 క్యారెట్లకు రెండ్రోజుల్లో 10 గ్రాములపై రూ.800 మేర పెరిగింది. ఇవాళ ఒక్కరోజే రూ.500 మేర పెరిగి ప్రస్తుతం రూ.56 వేల 200 మార్క్ వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ఇవాళ ఒక్కరోజే రూ.550 మేర పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61 వేల 310 పలుకుతోంది. ఆల్ టైమ్ హైకి రూ.50 చేరువలో ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.500 పెరిగి ప్రస్తుతం రూ. 56 వేల 350 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ఢిల్లీలో తులానికి రూ.550 పెరిగింది. ప్రస్తుతం రూ.61 వేల 460 మార్క్ వద్ద ఉంది. వెండి విషయానికి వస్తే మళ్లీ ఆల్ టైమ్ హైకి చేరింది. ఇవాళ ఒక్కరోజే రూ.1000 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండిరేటు హైదరాబాద్‌లో రూ. 81 వేల 400 మార్క్ చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే కిలోపై రూ.750 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రేటు ఢిల్లీలో రూ.77 వేల 350 పలుకుతోంది. హైదరాబాద్‌లో వెండి రేటు, ఢిల్లీలో బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అందుకు ఆయా ప్రాంతాల్లోని ట్యాక్సులు కారణంగా చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement