Sunday, May 19, 2024

బాబోయ్ ఇవేం హామీలు?

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు పలు వాగ్ధానాలు చేయడంతో పాటు చిత్ర విచిత్రంగా ప్రచారాలు చేస్తున్నారు. ఎన్ని కలు సమీపిస్తుడడంతో పోటీ అభ్యర్థులు వరాల జల్లు కురిపిస్తున్నారు. తమిళనాట హోరా హోరీగా సాగుతున్న ఈ ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి హామీలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి

దక్షిణ మధురై నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన శరవణన్ ఎవరూ ఊహించని విధంగా హామీలు గుప్పించారు. తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గ ప్రజలను బ్యాచ్‌ల వారీగా చంద్రమండలం పైకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అటు నియోజకవర్గంలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. అలానే ఇళ్లలో ఆడవాళ్ల పనికి సాయంగా ఇంటింటికీ రోబో పంపిణీ చేస్తానన్నారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కాల్వలు తవ్వించి ఇంటికో బోటు పంపిణీ చేయించేలా ఏర్పాటు చేస్తానన్నారు. ఎండ వేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడేందుకు300 అడుగుల ఎత్తున కృత్రిమ మంచు కొండ నిర్మాణం చేపడతానన్నారు. ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమ సముద్రం నిర్మాణం చేస్తానని, నియోజకవర్గ ప్రజలందరికీ ఐఫోన్ బహుమతిగా ఇస్తానని తాయిలాలు ప్రకటించారు. కాగా ప్రస్తుతం శరవణన్ ఇచ్చిన హామీలు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement