Wednesday, May 15, 2024

ఆజాది కా అమృత మహోత్సవ్ – పెద్ద‌ప‌ల్లిలో ఫ్రీడం రన్…

పెద్ద‌ప‌ల్లి – ఆజాది కా అమృత మహోత్సవ లో భాగంగా పెద్దపెల్లి జిల్లాలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ కు భారీ స్పందన లభించింది. బుధవారం జూనియర్ కళాశాల మైదానంలో టూకే రన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత జెండా ఊపి ప్రారంభించారు. 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో టూకే రన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, డిసిపి రవీందర్, ఏసీపీ నితిక పంత్, సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రాజేష్ ల తో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement