Wednesday, May 29, 2024

Press Meet – రైతాంగాన్ని నిలువున ముంచిన కాంగ్రెస్… కెటిఆర్

క‌ష్టాల క‌డ‌గండ్ల‌ల‌లో రైత‌న్న‌లు
ధాన్యం కొనుగోళ్లు జ‌ర‌గ‌క ఇక్క‌ట్లు
హ‌మాలీల కొర‌త‌తో కొత్త క‌ష్టాలు
రైతుల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం
రోడ్డు ఎక్కుతాం.. రేవంత్ ను నిలదీస్తాం
తెలంగాణ భ‌వ‌న్ ప్రెస్ మీట్ లో కెటిఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . రైతులు కష్టాల కడగండ్లలో ఉన్నార‌ని అయినా .. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వ‌జ‌మెత్తారు… ప్ర‌స్తుతం తెలంగాణ రైతాంగం ద‌య‌నీయ‌మైన పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు లు స్తంభించిపోయాయని అన్నారు. తెలంగాణ భ‌వ‌న్ లో నేడు ఆయ‌న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, వ్య‌వ‌సాయ‌రంగాన్ని పర్యవేక్షించే వ్యవస్థ లేదన్నారు. కామారెడ్డి లో రైతులు రోడ్లు ఎక్కరని తెలిపారు. హమాలీ లా కొరత ఉందన్నారు. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టాలని సూచించారు. తరుగు లేకుండా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒక్క దగ్గర కాదు చాలా చోట్ల ఇదే పరిస్థితి అన్నారు. రైతులు ఆందోళనలో ధర్నాలు చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -

ఇరువై ఐదు,ముప్పై రోజులుగా ధాన్యం తీసుకు వచ్చిన కొనుగోలు చేయడం లేదన్నారు. తడిసిన దాన్యం,తరుగు లేకుండా ఎఫ్ సి ఐ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు.. క్వింటాల్ కి బోనస్.. రుణమాఫీ అయ్యేంత వరకు తాము రైతుల వెంట ఉంటామన్నారు. అవసరం అయితే రైతుల కోసం ధర్నాలు, దీక్షలు నిర్వహిస్తామ‌ని,..రోడ్ల మీదకు వస్తామని హెచ్చ‌రించారు.

ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ లలో గత 4 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఆ జిల్లాల పట్టభద్రులు గెలిపిస్తారని నమ్ముతున్నామని తెలిపారు. విద్యావంతుడు, ఉత్సాహావంతుడు రాకేష్ రెడ్డి నీ కేసిఆర్ బరిలో నిలిపారన్నారు. ఓటర్లకు మా విజ్ఞప్తి.. కాంగ్రెస్ మోసపూరిత హామీలు విన్నారు.. ఐదు నెలల పాలన లో ఎలా దగ్హ చేశారో చూశారన్నారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ అన్నారు ఏ మాట నిలబెట్టుకోలేదన్నారు. టెట్ కోసం గతంలో 4వందల ఫీజు ఉంటే.. ఐదు రెట్లు పెంచి రెండు వేలు చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు.. వసతుల కోసం నిబద్ధతతో పని చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ఐదు నెలలు కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో చూశారన్నారు. నల్గొండలో ఒక్క మెడికల్ కళాశాల కూడా లేకుండే.. తీసుకువచ్చింది కేసిఆర్ అని గుర్తుచేశారు.

సీఎం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని, నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదన్నారు కెటిఆర్ . ఈ ప్రభుత్వానికి ఐదు నెలల కాలపరిమితి ముగిసిందన్నారు. మరో ఏడు నెలల కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీసే గొంతుక కావాలి అంటే రాజేష్ రెడ్డి నీ గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయులర్.. ఎప్పటికప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదన్నారు. ఆయన్ను గెలిపిస్తే మరో నయీంగా మారుతాడన్నారు. టీవీ చానెళ్లు అడ్డుపెట్టుకొని బెదిరించే మరో బ్లాక్మెయిల్ ను గెలిపించకూడదన్నారు. చిల్లర రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నార‌న్నారు.

కేసిఆర్ సమర్ధవంతంగా ప్రభుత్వాన్ని నడిపారన్నారు. రేవంత్ రెడ్డి ముఖం బాగోలేక అద్దం పగలగిట్టుకున్నాట్లు ఉందన్నారు. నిన్న నారాయణ ఖేడ్ లో టీచర్ లా మీద పోలీసులు లాఠీ చార్జి చేస్తున్నారని తెలిపారు. వారు ఎన్నికల్లో పాల్గొన్నందుకు తగిన వేతనం ఇవ్వాలని అడగడం తప్పా? అన్నారు. మూడు లక్షల 89 వేల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పు అని కేంద్రం చెప్పిందన్నారు. ఏడు లక్షల కోట్లు అని కాంగ్రెస్ ప్రచారం చేసిందన్నారు. అప్పు అనేదే తప్పు అన్నట్లు ప్రచారం చేసిన కాంగ్రెస్ సన్నాసులు ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నారు.

రాహుల్ జీ… ప్రేమ పంచ‌డం అంటే ఇదేనా

‘రాహుల్ గాంధీ గారూ! మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అచ్చంపేటలో బుధవారం బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడులకు పాల్పడ్డారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలపై దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియోను ఆయ‌న జత చేశారు. ‘నిన్న అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ గూండాల దాడిలో స్థానిక పోలీసుల ప్రేక్షక పాత్ర చూడండి’ అంటూ ఆరెస్పీ తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేశారు.

‘మీరు చెప్పే ‘ప్రేమను పెంచడం’ అంటే ఇదేనా రాహుల్ జీ’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో కేటీఆర్‌ ఒక పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్‌ నేతలు అధికార దుర్వినియోగంతో ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఈ దాడులు, దుర్భాషల్లో పోలీసులు కూడా భాగస్వాములు కావడం సిగ్గుచేటని కేటీఆర్‌ మండిపడ్డారు. దాడికి పాల్పడిన గూండాలపై, ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే తాము మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామంటూ తెలంగాణ డీజీపీ ని టాగ్‌ చేశారు. తాము కచ్చితంగా న్యాయాన్ని గెలిపించుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement