Monday, May 13, 2024

బీఆర్​ఎస్​ ఏర్పాటు.. సీఎం కేసీఆర్​ని అభినందించిన పలు రాష్ట్రాల నేతలు, ప్రముఖులు

బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత, తిరుమావళవన్, వివిధ రాష్ట్రాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, తెలంగాణ స్ఫూర్తి తో దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న దళిత సోదరులతో దళిత్ కాంక్లేవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు తమిళనాడు ఎంపీ తిరుమావళవన్ శాలువా కప్పి సన్మానించారు.

కాగా, తిరుమావళన్ మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నానని, దళితుల కోసం ఇన్ని పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడంలేదని ఆయన ప్రశంసించారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు గొప్ప పథకమని అభినందించారు. సీఎం కేసీఆర్​ని గారిని కలిసిన వారిలో వివిధ రాష్ట్రాల రైతు నాయకులు రాకేశ్ రఫీక్, అక్షయ్ (ఒడిశా), సీనియర్ జర్నలిస్టు వినీత్ నారాయణ (ఢిల్లీ), సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు గుర్నామ్ సింగ్ (హర్యానా) , మహారాష్ట్ర రైతు నాయకుడు దశరథ్ సావంత్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement