Sunday, April 28, 2024

ఆలియా, రణ్​బీర్​ ఇంట్లో సందడే సందడి.. బేబీ షవర్​ ఫొటోస్​ని షేర్​ చేసిన క్యూట్​ కపుల్​

రీసెంట్ గా పెళ్లి చేసుకున్న బాలివుడ్ క్యూట్ క‌పుల్.. ఆలియా భట్, రణబీర్ కపూర్ వారి మొద‌టి సంతానం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్యూట్ క‌పుల్​ బాంద్రాలోని వారి సొంతింట్లో బేబీ షవర్‌ను నిర్వహించారు. అక్టోబరు 5న జరిగిన బేబీ షవర్ కార్య‌క్ర‌మానికి నీతూ కపూర్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, మహేష్ భట్, కరిష్మా కపూర్, రిమా జైన్, అనుష్క రంజన్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కాగా, ఆ స్పెషల్ మూమెంట్స్ ని ఇవ్వాల (గురువారం) ఆలియా షేర్​ చేసుకున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా తన బేబీ షవర్‌లోని ఫొటోలను పంచుకున్నారు. చూడ ముచ్చ‌ట‌గా ఉన్న ఈ ఫొటోల‌ను చూసిన అభిమానులు సంత‌షం వ్యక్తం చేస్తున్నారు.. అల్ ది బెస్ట్, కంగ్రాచ్చులేష‌న్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement