Friday, April 26, 2024

టీఎస్ ఆర్టీసీ అధికారిక కొత్త‌ వెబ్ పోర్ట‌ల్ – ప్రారంభించిన బాజీరెడ్డి గోవ‌ర్థ‌న్, స‌జ్జ‌నార్

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్ బాజీరెడ్డి గోవ‌ర్థ‌న్ , ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ కొత్త వెబ్ సైట్ ని ప్రారంభించారు. టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ పోర్ట‌ల్ ఇక‌పై tsrtc.telangana.gov.in గా ఉండ‌నుంది. కాగ హైద‌రాబాద్ లోని బ‌స్ భ‌వ‌న్ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వం వేడుక‌ల్లో ఆర్టీసీ చైర్మెన్, ఎండీ పాల్గొన్నారు. అనంత‌రం ఆర్టీసీ కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించారు. పాత వెబ్ సైట్ ను కాస్త మార్చి కొత్త హంగుల‌ను జోడించి ఈ వెబ్ సైట్ ను రూపొందిచామ‌న్నారు. ఈ కొత్త వెబ్ సైట్ చాలా ఈజీగా ఉంటుంద‌న్నారు. సామాన్యులు కూడా ఈ కొత్త వెబ్ సైట్ ను వినియోగించేలా ఉంటుంద‌ని చెప్పారు. అలాగే అంద‌రూ కూడా టీఎస్ఆర్టీసీ కొత్త వెబ్ పోర్ట‌ల్ ను సంద‌ర్శించాల‌ని కోరారు. ప్ర‌యాణీకుల సూచ‌న‌లు, అభిప్రాయాల‌ను కూడా ఈ వెబ్ సైట్ ద్వారా తమ దృష్టికి తీసుకురావ‌వ‌చ్చొని వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement