Tuesday, May 7, 2024

క్రికెట్ స్పోర్ట్ నేప‌థ్యంలో జాన్వీక‌పూర్ మూవీ – శిక్ష‌ణలో బిజీగా బాలీవుడ్ బ్యూటీ

ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీక‌పూర్. దోస్తానా2 మూవీలో న‌టిస్తోంది. మ‌రోచిత్రం మిస్ట‌ర్ అండ్ మిస్ మ‌హి మూవీ షూటింగ్ కి సిద్ధ‌మ‌వుతోంది. క్రికెట్ స్పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం జాన్వీ కపూర్ శిక్షణ పొందుతోంది. ఈ సందర్భంగా ఓ క్రికెట్ క్యాంప్ లో తన శిక్షణకు సంబంధించిన ఫొటోలను, తన టీమ్ ఫొటోలను షేర్ చేసింది. ఫొటోలను పోస్ట్ చేస్తూ జాన్వీ కపూర్ వివరించారు. ‘క్రికెట్ క్యాంప్ మిస్టర్ అండ్ మిస్ మహి’ అంటూ క్యాప్షన్ పెట్టింది. తన టీమ్ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ ఫొటోలు తన రాబోయే చిత్రం నుంచి జాన్వీ కపూర్ లుక్ లాంటిగా భావించారు. ఈ మూవీలో స్టారర్ గా జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావు నటిస్తున్నారు. వీరిద్దరూ ఇదివరకు రూహీ మూవీలో నటించారు. కాగా, మిస్టర్ అండ్ మిస్ మూవీని శరణ్ శర్మ డైరెక్ట్ చేయనున్నారు. నిఖిల్ మెహోత్ర రచయితగా పనిచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement