Sunday, May 5, 2024

‘జాంజిబార్’ సినీ రంగానికి.. ప‌ర్యాట‌క అంబాసిడ‌ర్ గా సంజ‌య్ ద‌త్త్‌..

టాంజానియా దేశంలోని జాంజిబార్ సినీ రంగానికి, పర్యాటక అంబాసిడర్‌గా బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్‌ నియామకమయ్యారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఆ దేశానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సంజ‌య్‌ని నియ‌మించుకున్నారు.ఈ అవ‌కాశాన్ని క‌లిపించినందుకు సంజ‌య్ ద‌త్త్ సంతోషం వ్య‌క్తం చేశారు. మిమ్మ‌ల్ని క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది. జాంజిబార్లోని పెట్టుబడులు ఆరోగ్యం , విద్యా రంగానికి సహకరించే అవకాశం లభించడంతోపాటు మీ ప్రభుత్వ సహకారంతో ఈ అందమైన ద్వీప నగరానికి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అంబాసిడ‌ర్‌గా ఉన్నందుకు గౌర‌వంగా ఉంద‌ని సంజ‌య్ అన్నారు. సంజయ్ టాంజానియా ప్రధానమంత్రిని కలుసుకున్నారు. అతనితో ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేసారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement