Saturday, April 27, 2024

Story : 2023 ఏప్రిల్ నాటికి జనాభాలో.. ఇండియానే టాప్

2023ఏప్రిల్ నాటికి జనాభాలో ఇండియానే టాప్ గా నిలవనుందట. త్వరలోనే చైనా స్థానంలో భారత్ నిలవనుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మరో నాలుగు నెలల్లో.. అంటే 2023 ఏప్రిల్ నాటికి జనాభాలో మన దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా మారనుందని పేర్కొంటున్నాయి. చైనా జనాభా ప్రస్తుతం సుమారు 145 కోట్లు కాగా మన దేశ జనాభా 141 కోట్లుగా ఉంది. ఇటీవలి కాలంలో చైనాలో జననాల సంఖ్య తగ్గిపోయింది. గతేడాది కేవలం 1.6 కోట్ల జననాభా మాత్రమే నమోదయ్యాయి. చైనాలో మరణాల సంఖ్యతో పోలిస్తే ఇది పెద్ద సంఖ్య కాదని నిపుణులు చెబుతున్నారు.

1983లో చైనా జనాభా వృద్ధి రేటు 2 శాతంగా ఉండగా, ప్రస్తుతం 1.1 శాతం ఉంది. అంటే, జననాల రేటు దాదాపు సగానికి పడిపోయింది. జననాల సంఖ్య పడిపోవడంతో చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల యువత జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య ఎక్కువవుతోందని కలవరపడుతోంది. భారత్‌లోనూ అదే పరిస్థితి. 1950లో భారత సంతానోత్పత్తి రేటు సగటున 5.7 శాతంగా ఉండగా, అది ఇప్పుడు రెండుకు తగ్గింది. అయితే, సగటు ఆయుర్దాయం పెరగడంతో మరణాల సంఖ్య జననాలతో పోలిస్తే తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మరణాల రేటు తగ్గిపోవడం, ఆయుర్దాయం పెరగడంతో జనాభా పెరుగుదల నిలకడగా ఉందంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement