Wednesday, May 15, 2024

లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్స్- సెన్సెక్స్ 503.69

నేటి స్టాక్ మార్కెట్స్ లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. గురువారం ఉదయం మార్కెట్లు అదే జోష్‌తో పైకి కదులుతున్నాయి. సెస్సెక్స్‌ 503.69 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్లు పెరిగాయి. మార్కెట్‌ ప్రారంభసమయంలో సెన్సెక్స్‌ 56323.60 పాయింట్లు, నిఫ్టీ 16782.10 పాయింట్ల వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ మరోసారి 16,700 మార్కెట్‌ను దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 56,479.67, నిఫ్టీ 16,818 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. మార్కెట్లో ఐటీ, మెటల్‌ రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.ఇదిలా ఉండగా..

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచింది. ఫెడరల్ రిజర్వ్ వరుసగా రెండోసారి వడ్డీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఆర్థిక మందగమనాన్ని ఫెడ్ ఛైర్మన్ జెరోన్ పావెల్ ఖండించారు. ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయం తర్వాత అమెరికా మార్కెట్లు పుంజుకున్నాయి. డౌ జోన్స్ 436 పాయింట్లు, నాస్‌డాక్ 470 పాయింట్లు లాభపడ్డాయి. సింగపూర్‌ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సైతం పెరుగుదలను నమోదు చేస్తున్నది. 100 పాయింట్లు పెరిగి 16,750 స్థాయిని దాటి.. ప్రస్తుతం 16,811 వద్ద ట్రేడవుతున్నది. టేడ్రింగ్‌ ప్రారంభంలో ఎంటీఎన్‌ఎల్‌ షేర్లు 11 శాతం లాభపడగా.. ఎయిర్‌లైన్‌ కంపెనీ స్పైస్‌జెట్‌ షేర్లు 8శాతం పడిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement