Saturday, May 18, 2024

పట్నా ఉగ్ర దాడి కుట్ర వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు

దర్భంగాలోని ఉగ్రవాద అనుమానితులైన సనావుల్లా, నూరుద్దీన్, ముస్తాఖీం ఇండ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ప్రారంభించింది. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)లో క్రియాశీలక సభ్యులైన ఈ ముగ్గురు నిందితుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నూరిద్దీన్‌ ప్రస్తుతం పట్నాజైలులో ఉండగా, మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. పట్నా మాడ్యూల్‌ను బీహాల్‌ పోలీసులు జులై 14న ఛేదించారు. 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మారుస్తామని, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకోవాలని ఈ ముగ్గురు నిందితులు కుట్ర పన్నారని పోలీసులు చెప్పారు. కాగా, ఈ కేసును కేంద్ర హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement