Sunday, May 19, 2024

త‌గ్గుముఖం ప‌డుతోన్న బంగారం ధ‌ర‌లు-ప‌సిడి బాట‌లోనే వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. జూలై 28న హైదరాబాద్‌లో బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 క్షీణతతో రూ. 50,680కు దిగొచ్చింది. 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు అయితే రూ. 130 తగ్గింది. పది గ్రాములకు రూ. 46,450కు క్షీణించింది. బంగారం రేటు తగ్గితే వెండి కూడా ఇదే దారిలో పయనించింది. సిల్వర్ రేటు రూ. 800 పడిపోయింది. రూ. 60 వేలకు పడిపోయింది.దేశంలోని ప్రముఖ జువెలరీ సంస్థల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కల్యాణ్ జువెలర్స్‌లో గోల్డ్ రేటు రూ. 46,350 వద్ద ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్‌లో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. లలితా జువెలర్స్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ. 4,645 వద్ద ఉంది. సిల్వర్ రేటు గ్రాముకు రూ. 60 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం రేటు గ్రాముకు రూ. 3032 వద్ద ఉంది. జోయాలుక్కాస్‌లో గోల్డ్ రేటు గ్రాముకు రూ. 4635 వద్ద కొనసాగుతోంది. కాగా పైన పేర్కొన్న బంగారం రేట్లు అన్నింటికీ జీఎస్‌టీ, తయారీ చార్జీలు, ఇతరత్రా చార్జీలు అదనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement