Thursday, May 2, 2024

కాంగ్రెస్ ప‌ట్ల స్పీక‌ర్ వివ‌క్ష – మైక్ అడిగినా ఇవ్వ‌లేదు – భ‌ట్టి విక్ర‌మార్క‌

బ‌డ్జెట్ పై తెలంగాణ కాంగ్రెస్ అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. బ‌డ్జెట్ అంచ‌నాలు వాస్త‌వానికి దూరంగా ఉన్నాయ‌ని భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికే ఈ బ‌డ్జెట్ స‌మావేశాల‌ని అన్నారు. బంగారు తెలంగాణ పేరుకే అని ఎద్దేవా చేశారు. ప్ర‌చారం కోసం ప‌ని చేస్తుంది త‌ప్ప‌..రైతుల‌కు..పేద‌ల‌కు ప‌నికి వ‌చ్చే బ‌డ్జెట్ కాద‌న్నారు. స‌బ్ ప్లాన్ నిధులు కూడా ప‌క్క‌దోవ ప‌ట్టించే ప‌ని జ‌రిగింద‌న్నారు. మాకు మైక్ ఇవ్వండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా స‌భా ప‌తి మా వైపు కూడా చూడ‌లేద‌న్నారు. ఇవి ప్ర‌భుత్వ స‌భ‌లు కాదు..చ‌ట్ట స‌భ‌లని భ‌ట్టి అన్నారు. స్పీక‌ర్ వివ‌క్ష చూపిస్తున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement