Thursday, April 25, 2024

పాత‌బ‌స్తీకి మెట్రో రైలు.. బ‌డ్జెట్‌లో 500 కోట్లు కేటాయింపు

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఓల్డ్ సిటీ వాసుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు కోసం ఎదురుచూస్తున్న పాత‌బ‌స్తీ వాసుల క‌ల త్వ‌ర‌లోనే నెర‌వేర‌నుంది. పాత‌బ‌స్తీలో మెట్రో రైలు కోసం రూ. 500 కోట్లు కేటాయింపులు చేస్తున్న‌ట్లు ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. పాతబస్తీలోని 5.5 కి.మీ మార్గాన్ని అనుసంధానం చేయటంలో అనేక అవాంతరాలు చోటుచేసుకున్నాయి. వారసత్వ కట్టడాలు, ప్రార్థనా స్థలాలు ఉండటం వల్ల పనులకు ఇబ్బందులు తలెత్తాయి. అవాంతరాలు పరిష్కారమయ్యే సమయానికి కోవిడ్ ప్రభావం వల్ల మెట్రో ప్రాజెక్టు నష్టాల బారిన పడ్డది. ఏదేమైన‌ప్ప‌టికీ ఈ మార్గంలో మెట్రో రైలు నిర్మాణం కోసం ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని మంత్రి స్ప‌ష్టం చేశారు.

హైద‌రాబాద్ మెట్రో ప‌రిధిలో రోజుకు 20 లీట‌ర్ల ఉచిత నీటి ప‌థ‌కానికి రూ. 300 కోట్లు కేటాయించారు. అర్బన్ మిషన్ భగీరథకు రూ. 800 కోట్లు, ఎయిర్‌పోర్టు మెట్రో అనుసంధానానికి రూ. 500 కోట్లు, హైద‌రాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కు రూ. 1500 కోట్లు
హైద‌రాబాద్‌, ఓఆర్ఆర్ చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొర‌త‌ను తీర్చేందుకు రూ. 1200 కోట్లు కేటాయించారు. హైద‌రాబాద్‌లో నాలాల మ‌ర‌మ్మ‌తుల ప‌నులు రూ. 858 కోట్ల‌తో ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.

ఓఆర్ఆర్ చుట్టూ 387 కోట్ల‌తో స‌ర్వీసు రోడ్ల విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌న్నారు. రూ. 36.5 కోట్ల‌తో గండిపేట చెరువును మ‌రింత అభివీద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు. రూ. 1450 కోట్లతో సుంకిశాల నుంచి కృష్ణాజలాలను హైదరాబాద్‌కు అందించడానికి పైపులైన్ నిర్మాణం చేపట్టింది. ఇందు కోసం రూ. 725 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement