Thursday, May 2, 2024

ఐపీఎల్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా ర‌బాడ‌

ఐపీఎల్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ గా ప్ర‌త్యేక గుర్తింపుని సంపాదించాడు ద‌క్షిణాఫ్‌రికా బౌల‌ర్ కగిసో రబాడ..దాంతో ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య సోమవారం మ్యాచ్ లో ఈ రికార్డు నమోదైంది. 98 వికెట్లతో రబాడా దక్షిణాఫ్రికా బౌలర్లలో మొదటి స్థానానికి చేరాడు. 97 వికెట్లతో ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న డేల్ స్టిన్ ను వెనక్కి నెట్టేశాడు. మిశ్చెల్ మార్ష్ వికెట్ తీయడంతో ఈ ఘనత సొంతమైంది. నిన్నటి మ్యాచ్ లో రబాడాకు ఈ ఒక్క వికెట్టే దక్కింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు చేజార్చుకుందని చెప్పుకోవాలి. పంజాబ్ కింగ్స్ కేవలం ఆరు విజయాలతో కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో విజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ కు దగ్గరైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement