Sunday, April 28, 2024

Smart: టెక్ ప్రియులకు మరో అప్‌డేట్‌.. అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో వన్ ప్లస్ 10 ప్రొ వ‌చ్చేస్తోంది..

స్మార్ట్ ఫోన్ కంపెనీ వ‌న్ ప్ల‌స్ త‌మ మ‌రో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ని లాంచ్ చేయ‌డానికి రెడీ అవుతోంది. 10 ప్రొకి సంబంధించిన ఫీచ‌ర్స్, ప్రైస్ ఎంత‌న్న‌దానికి సంబంధించి తాజాగా టెక్ ఎక్స్‌ప‌ర్ట్స్ నుంచి ఓ లీక్ వ‌చ్చింది. స్మార్ట్ ఫోన్ రంగంలో యాపిల్ త‌ర్వాత అదే స్థాయిలో హై ఎండ్ మొబైల్స్‌ని అందిస్తోంది. వ‌న్‌ప్ల‌స్‌. యాపిల్ ఫోన్ల‌కు ఉన్న క్రేజ్ ఆండ్రాయిడ్ వ‌ర్ష‌న్‌లో వ‌న్ ప్ల‌స్‌కి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ స్పెసిఫికేష‌న్స్‌, లాంఛ్ డేట్‌, ధ‌ర వివ‌రాల‌పై మ‌రో లీక్ హ‌ల్‌చ‌ల్‌ చేస్తోంది. వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ రియ‌ర్ సైడ్ భారీ స్వ్కేర్ కెమెరా మాడ్యూల్‌తో పాటు ముందుభాగంలో క‌ర్వ్‌డ్ పంచ్‌-హోల్ డిస్‌ప్లేతో ఆక‌ట్టుకోనుంది. 6.7 ఇంచ్‌ల సిర్కా డిస్‌ప్లేతో పాటు 125 డ‌బ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం క‌లిగిఉంటుంద‌ని లీక్ వెల్ల‌డించింది.

స్నాప్‌డ్రాగ‌న్ 839 చిప్‌సెట్‌తో ఈ డివైజ్ రానుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 2022 జ‌న‌వ‌రి నెలాఖ‌రున‌ లేదా ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో రానున్న‌ట్టు తెలుస్తోంది. వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ ధ‌ర దాదాపు రూ 69,999 నుంచి అందుబాటులో ఉంటుంద‌ని టెక్ ఎక్స్‌ప‌ర్ట్స్ భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement