Friday, April 19, 2024

Pushpa: ఒక్క పాటకు అన్ని కోట్ల?: సమంతకు భారీ రెమ్యూనరేషన్!

అక్కినేని నాగ చైత‌న్య నుండి విడిపోయాక టాలీవుడ్ బ్యూటీ స‌మంత సినిమాలతో బిజీ అవుతోంది. వరుసగా సినిమాలను సైన్ చేస్తూ.. గ్లామర్‌ పరంగానూ తగ్గేదెలే అంటోంది. అంతే కాదు రెమ్యూనిరేషన్ విషయంలోని టాక్ అఫ్ ది టాలీవుడ్ గా మారింది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఇక ఈ పాట కోసం అమ్మడు భారీగానే పారితోషికం తీసుకోనున్నదని ఫిల్మ్ నగర్ టాక్. ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం స‌మంత నాలుగు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన‌నుంది. ఇందు కోసం ఆమె కోటిన్న‌ర రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేయ‌నుంద‌నే టాక్ వినిపిస్తోంది. తన కెరీర్‌లో సమంతకు ఇదే తొలి ఐటెమ్‌ సాంగ్‌ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement