Saturday, May 21, 2022

ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి త‌ర‌లించాలి: తెలంగాణ సర్కార్ కు కిషన్ రెడ్డి సూచన

ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో తాము రైతుల‌కు వాస్త‌వ ప‌రిస్థితులు తెలియ‌జేస్తున్నామ‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ‌లో ప్ర‌జా సంగ్రామ యాత్రకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజ‌రు కానున్న నేప‌థ్యంలో అక్క‌డ‌ ఏర్పాట్ల‌ను కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప‌రిశీలించారు. అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాల‌ను తెర‌వ‌లేద‌ని కిషన్ రెడ్డి అన్నారు. ఇప్ప‌టికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఎఫ్‌సీఐకి త‌ర‌లించాల‌ని చెప్పారు. ఎఫ్‌సీఐ ధాన్యాన్ని సేక‌రించేందుకు అన్ని ర‌కాలుగా ఏర్పాట్లు చేసుకుంద‌ని వెల్లడించారు. రైతులను ఆదుకోవాలన్న దృక్ప‌థంతో కేంద్ర ప్ర‌భుత్వం అన్న‌దాత‌ల‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని కిషన్ రెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement