Saturday, April 27, 2024

రూ.2వేల నోట్ల మార్పిడిపై ఎస్బీఐ కీలక ప్రకటన

రూ.2000 నోట్ల మార్పిడి పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. 2000 రూపాయల నోట్ల మార్పిడికి ప్రజలు ఎవరూ కూడా ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. అంతేకాదు రిక్వెస్ట్ ఫామ్ నింపాల్సిన పనిలేదని పేర్కొంది. అర్బీఐ వెల్లడించిన రూల్స్ ప్రకారం ఒకే విడతలో గరిష్టంగా రూ. 20 వేల వరకు నోట్లను మార్చుకోవచ్చునని ప్రకటనలో వివరించింది.

బ్యాంకుల్లో నోట్ల మార్పిడి చేసుకోవాలంటే ఖాతాదారులు ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలతో పాటుగా ఒక ఫారమ్‌ను సమర్పించాలని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీనిపై క్లారిటీ ఇస్తూ ఎస్బీఐ ఒక ప్రకటన విడదల చేసింది. సో మీ దగ్గర రూ.2000 నోట్లు ఉంటే వెంటనే వెళ్లి మార్చుకోవచ్చు. రూ.1,000, పాత రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ.2,000 డినామినేషన్ కరెన్సీ నోటును నవంబర్ 2016లో ప్రవేశపెట్టారు. ఆర్‌బిఐ ప్రకారం, ఇతర డినామినేషన్లలో కరెన్సీ తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టే లక్ష్యం నెరవేరింది. అలాగే, 2018-19లో రూ.2,000 నోట్ల ముద్రణను ఇప్పటికే నిలిపివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement