Friday, April 19, 2024

బ్రో మూవీ టీం.. పెద్ద‌మ్మ త‌ల్లి గుళ్ళో భోజనాలు

బ్రో మూవీ టీం పెద్ద‌మ్మ త‌ల్లి గుళ్లో భోజ‌నాలు పెట్టింది. ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నారు. కాగా ఈ చిత్ర నిర్మాతలు పీపుల్స్ మీడియా సంస్ధ వారు ఈ భోజనాలు ఏర్పాటు చేసారు పెద్దమ్మ దేవాలయం హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు, స్టూడియోలు ఉండటం వలన ముహూర్తాలు, సినిమా ప్రారంభోత్సవాలవంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంటుగా మారింది.కాగా ఉస్తాద్ భగత్ సింగ్, OG అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన పవన్ తాజాగా #BRO పై దృష్టి పెట్టారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక సినిమా చేస్తుననారు. తమిళ హిట్ మూవీ వినోదయ సీతంకు ఫ్రీమేక్ గా దర్శకుడు సముద్ర ఖని నేతృత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు స్క్రీన్ ప్లే అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement