Saturday, April 27, 2024

Asking: స‌బ్ కా సాథ్.. స‌బ్ కా వికాస్ అంటే ఇదేనా?.. ప్ర‌ధాని మోదీపై కేటీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ నిధుల అంశంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ చెబుతున్న స‌బ్ కా సాథ్.. స‌బ్ కా వికాస్, స‌మాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా? అని ప్ర‌శ్నించారు. భారీ వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. 2018 నుంచి ఎన్డీఆర్ఎఫ్ ద్వారా ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేదన్నారు. 2020లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు.. వ‌ర‌ద సాయం కోసం ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వ‌లేదని, ఇప్పుడు గోదావ‌రి వ‌ర‌ద‌ల‌కూ కేంద్రం సాయం చేయ‌ట్లేదని మండిప‌డ్డారు. ఇదేనా స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్ అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement