Friday, June 2, 2023

సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో.. ఘనంగా బోనాల పండుగ

హైద‌రాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ వ‌ద్ద ఉన్న‌ సమాచార భవన్ లో బోనాల పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం బోనాల పండుగ జ‌రిగింది. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ కూర్మాచలం, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ బి.రాజమౌళి, అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లేతో పాటు ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, జాయింట్ డైరెక్టర్లు డి.ఎస్. జగన్, డి. శ్రీనివాస్, కె.వెంకటరమణ, ప్రెస్ అకాడెమీ కార్యదర్శి వెంకటేశ్వర రావు, సమాచార శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ వి. రాధా కిషన్, మాజీ డైరెక్టర్లు కిస్మత్ కుమార్, సుభాష్ గౌడ్ శాఖలో పనిచేసి పదవి విరమణ చేసిన ఉన్నతాధికారులు, సిబ్బంది బోనాల ఉత్స‌వంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement