Saturday, May 11, 2024

Rythu Bandhu: ఊరూరా రైతుబంధు సంబురం..

తెలంగాణలో పంట పెట్టుబడి సాయం అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. దండగ అన్న వ్యవసాయాన్ని రైతు బంధు పథకం పండుగ చేసింది. కర్షకులకు వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించింది. అప్పుల ఊబి నుంచి గట్టెక్కిచ్చింది. సాగుకు భరోసానిచ్చింది. ప్రతి సీజన్‌లో పెట్టుబడి సాయం అందుకుని రైతులు దర్జాగా సాగుకు కదులుతున్నారు. ఈ పథకానికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. పథకం ఆరంభం నుంచి ఈ నెల 10 లోపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమ అవుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ఖమ్మం నియోజకవర్గంలో సంబురాలు ప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నేతలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనల మేరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డౌలే లక్ష్మి ప్రసన్న – సాయికిరణ్ నేతృత్వంలో మిర్చి పంటతో “జై రైతు బంధు కెసీఆర్” అని ఆకారాన్ని రూపొందించారు. రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో మహిళలు తెలంగాణ రైతు బంధు అంటూ ముగ్గులు వేసి ముగ్ధులయ్యరు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement