Sunday, May 12, 2024

Breaking: ఖేర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా

గత వారం రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్​పై రష్యా దూకుడు మరింత పెంచింది. రెండు దేశాల సైన్యాల మధ్య భీకరపోరు కొనసాగుతోంది. పట్టణాల్లో దాడులు చేస్తున్న రష్యన్​ బలగాలు.. మరో ప్రధాన నగరమైన ఖేర్సన్​ను హస్తగతం చేసుకున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్​ అధికారులు ధ్రువీకరించినట్లు ఏఎఫ్​పీ వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు.. కీవ్​ లక్ష్యంగా దూసుకెళ్తున్న రష్యా సైన్యం స్థానిక మెట్రోస్టేషన్​ సమీపంలో భారీ పేలుళ్లకు పాల్పడింది. రష్యా ఉక్రెయిన్​పై.. క్షిపణులు, బాంబులు, రాకెట్లతో విరుచుకుపడుతుండడంతో ఎటువెళ్లాలో తెలియక ప్రజలు అల్లాడిపోతున్నారు. పెద్ద పెద్ద భవనాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. ఖేర్సన్..​ నల్ల సముద్రం వద్ద ఉక్రెయిన్​కు వ్యూహాత్మకంగా ఉన్న ముఖ్యమైన పోర్ట్​ సిటీ. కొద్దిగంటల ముందు.. ఖేర్సన్​ను​ రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకోలేదని ఉక్రెయిన్​ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అక్కడ ఇంకా రష్యా బలగాలతో యుద్ధం జరుగుతోందని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement