Sunday, May 5, 2024

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. ప్రకంపనలు రేపుతున్న మర్డర్ ప్లాన్.. బీజేపీ నేతల ప్రమేయంపై ఆరా..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు పన్నిన కుట్ర వ్యవహారంపై కీలక దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసుకి సంబంధించి బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపా, పీఏ రాజుకు నోటీసులు ఇవ్వనున్నారు. అలాగే మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిల పాత్రపై విచారణ చేయనున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ఆరునెలల క్రితమే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 18 తర్వాత మర్డర్ ప్లాన్ వేగవంతం చేసినట్లు సమాచారం. మంత్రి హత్య కుట్ర కేసులో నిందితులు పీఏ రాజు, డ్రైవర్ తాపాకు జితేందర్ రెడ్డి ఢిల్లీలో ఆశ్రయం ఇచ్చారు. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.

తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన ముఠాలోని ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు బుధవారం తెలిపారు. అరెస్టయిన వారిలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి చెందిన నలుగురు సహచరులు ఉన్నారు. అరెస్టయిన వారిని రాఘవేందర్ రాజు, అమరేందర్ రాజు, మధుసూధన్ రాజు, సిహెచ్ నాగరాజు, మున్నూరు రవి, వరద యాదయ్య, భండేకర్ విశ్వనాథ్, తాపాగా గుర్తించారు. నిందితుల్లో ముగ్గురిని ఢిల్లీ నుంచి – మాజీ ఎంపీ నివాసంలోని క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాత్రపై విచారణ జరుపుతున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement