Sunday, April 28, 2024

Petrol, Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధర పెంపుకు రంగం సిద్ధం..

రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌ ధర 111 డాలర్లకు చేరుకుంది. దాంతో చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బుధవారం బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 111 డాలర్లకు చేరింది. ఇది గత 8 ఏళ్లలో గరిష్టం. రానున్న రోజుల్లో ఈ ధర 115 నుంచి 125 డాలర్లకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నా.. భారతదేశంలో మాత్రం ప్రెటోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. గత మూడు నెలలుగా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీ స్థాయిలో పెరిగినా.. మన దగ్గర పెరగలేదు. దీనికి ప్రధాన కారణంగా ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడమే అని అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడే పెంచితే ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత వస్తుందని, దీనిప్రభావం ఎన్నికలపై పడుతుందని ధరల పెంపు జోలికి వెళ్లలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మార్చి 7న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్నాయి. అనంతరం పెట్రో ధరల పెంపుకు నిర్ణయం తీసుకుంటాయని చెబుతున్నారు. పెట్రోలు, డీజిల్ లీటరుకు రూ.15 నుంచి రూ.20కి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.108గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement