Wednesday, May 8, 2024

‘ఆర్ ఆర్ ఆర్’ క‌లెక్ష‌న్స్ – ఐదు రోజుల్లో రూ.107కోట్లు

తెలుగు రాష్ట్రాల‌తో పాటు విడుద‌లైన ప్ర‌తి ప్రాంతంలో ఈ చిత్రం వ‌సూళ్ల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, హిందీలో 5 రోజులకు గాను 107 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. లాంగ్ రన్ లో ఒక్క హిందీలోనే ఈ సినిమా 200 కోట్లను వసూలు చేయవచ్చని అంటున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ పాత్రల తరువాత బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ .. రే స్టీవెన్సన్ పాత్రలు బలమైనవిగా కనిపిస్తాయి. మిగతా పాత్రలన్నీ నామమాత్రంగానే అనిపిస్తాయి. సంగీతం .. ఫొటోగ్రఫీ .. కాస్ట్యూమ్స్ డిజైన్ .. ఆర్ట్ వర్క్ ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయని చెప్పాలి. వసూళ్ల పరంగా ఈ సినిమా జోరు అదే రేంజ్ లో కొనసాగుతుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement