Thursday, May 9, 2024

రెడీ, కెమెరా, యాక్ష‌న్‌, క‌ట్‌.. రేప‌టి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్‌!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ టాలీవుడ్‌లో బుధ‌వారం నుంచి సినిమా షూటింగ్‌లు ఆగిపోనున్నాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సినీ కార్మికుల‌కు వేత‌నాలు పెంచాల‌ని 24 క్ట్రాఫ్ట్స్‌కి చెందిన సిబ్బంది స‌మ్మె బాట ప‌ట్టేందుకు సిద్ధ‌మ్యారు. అయితే ఈ స‌మ్మె కార్య‌రూపం దాల్చ‌కుండా ఉండేలా నిర్మాత‌ల మండ‌లి స‌హా ప‌లు సంఘాలు మంగ‌ళ‌వారం య‌త్నించాయి. స‌మ్మె ప్ర‌తిపాదించిన విభాగాల జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌లించ‌లేదు.

అయితే.. ఈ చ‌ర్చ‌లు మంగ‌ళ‌వారం సాయంత్రం దాకా కొన‌సాగినా ఎట్లాంటి రిజ‌ల్ట్ రాలేదు. దీంతో చర్చ‌లు విఫ‌ల‌మైన నేప‌థ్యంలో రేప‌టి నుంచే తెలుగు సినిమా షూటింగ్‌ల‌ను బంద్ చేస్తున్న‌ట్లు తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ప్ర‌క‌టించింది. కార్మికుల వేత‌నాల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకునేదాకా స‌మ్మె విర‌మించేది లేద‌ని ఫెడ‌రేష‌న్ తేల్చి చెప్పింది. వేత‌న స‌వ‌ర‌ణ జ‌రిగేదాకా కొన‌సాగ‌నున్న స‌మ్మెలో 24 విభాగాల‌కు చెందిన కార్మికులు పాలుపంచుకుంటార‌ని ఫెడ‌రేష‌న్ ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement