Friday, April 26, 2024

రైతు బాంధ‌వుడు సీఎం ‘కేసీఆర్’ – మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ : రాష్ట్రంలో రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి సీఎం కేసీఆర్, ప్ర‌తీ రైతుకు బంధువు అయ్యార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ల‌క్ష్మ‌ణ‌చాంద‌ మండ‌ల కేంద్రంలోని రైతు వేదికలో, రైతు స‌మ‌న్వ‌య స‌మితి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన రైతు బంధు వారోత్స‌వాల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం చేశారు. విద్యార్థినిలు, మహిళలు , తెలంగాణ రైతు బంధు, కేసీఆర్ ముగ్గుల‌ను వేసారు. ముగ్గుల‌ను ఆస‌క్తిగా తిల‌కించిన మంత్రి…. విద్యార్థుల‌ను అభినందించారు. ముగ్గుల పోటీలు, వ్యాస ర‌చ‌న పోటీలు నిర్వ‌హించి, విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అందించారు. రైత‌న్న‌లు, కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన రైతు సంక్షేమ ప‌థ‌కాల‌పై విద్యార్థుల ప్ర‌సంగాలు విని, చ‌ప్ప‌ట్ల‌తో వారిని అభినందించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ సార‌ధ్యంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌న్నారు. రైతుల కోసం రైతు భీమా, రైతు బంధు ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని తెలిపారు. గ‌తంలో వ్య‌వ‌సాయం దండ‌గా అంటే, స్వ‌రాష్ట్రంలో వ్యవ‌సాయాన్ని పండుగ‌లా మ‌ర్చార‌న్నారు. రైతు బంధు ప‌థ‌కం ద్వారా రెండు పంట‌ల‌కు పెట్టుబ‌డి స‌హాయం అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్పుల బాధ‌తో రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే వారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దాత‌ల క‌ష్టాలు తీరాయ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement