Thursday, May 16, 2024

కేంద్రం సహకరించకున్నా రైల్​ కోచ్​ ఫ్యాక్టరీ ఏర్పాటు.. త్వరలోనే ప్రారంభం: కేటీఆర్‌

వరంగల్‌లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న హామీని కేంద్ర ప్ర‌భుత్వం నిలబెట్టుకోలేకపోయినా, తమకు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతుందని మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్​ ఆదివారం ట్వీట్ చేశారు. మేధా గ్రూప్‌చే ఏర్పాటు చేసిన దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రైలు కోచ్ ఫ్యాక్టరీలలో ఒకటి హైద‌రాబాద్ శివారులోని కొండకల్‌లో త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని ట్వీట్​ చేశారు మంత్రి కేటీఆర్​.

తెలంగాణ త్వరలో రైలు కోచ్‌లను తయారు చేసి రవాణా చేయబోతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇది జరిగేలా చేసిన యుగంధర్ రెడ్డికి, అతని టీమ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మేథా స ర్వో డ్రైవ్స్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement