Friday, May 17, 2024

మార్చి 25న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రిలీజ్

ఇప్ప‌టికే క‌రోనా, ఒమిక్రాన్ ల కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఎట్ట‌కేల‌కు రిలీజ్ డేట్ ను విడుద‌ల చేసింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన కుదరలేదు. మళ్లీ ఎప్పుడు రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారా అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 18వ తేదీనగానీ .. ఏప్రిల్ 28వ తేదీనగాని ఈ సినిమాను విడుదల చేయనున్నారనే టాక్ వినిపించింది. అయితే ఊహించిన దానికంటే ముందుగానే కరోనా తీవ్రత తగ్గుతూ ఉండటంతో మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కొంతసేపటి క్రితం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement