Wednesday, May 8, 2024

ఆర్ ఆర్ ఆర్ ట్రైల‌ర్ .. ఎప్పుడో తెలుసా ..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ . ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంకోసం మెగా ఫ్యాన్స్, నంద‌మూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొందుతోంది ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి మూహుర్తం ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్‌ డిసెంబర్‌ 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement