Wednesday, May 8, 2024

ప్ర‌ముఖ సింగ‌ర్ కేకే ఇక లేరు.. పాట‌పాడుతూనే పోయిన ప్రాణం

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సింగర్‌ కేకేగా పేరొందిన కృష్ణకుమార్‌ కున్నత్‌ (53) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో నిన్న (మంగ‌ళ‌వారం) రాత్రి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న ఆయ‌న‌ గదిలోనే కుప్పకూలినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనను వెంటనే ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు సీఎంఆర్‌ఐ డాక్ట‌ర్లు తెలిపారు. అంతకుముందు కేకే తన మ్యూజికల్‌ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

కాగా, కేకే మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక చిత్రాల్లో పాటలు పాడారు. తెలుగులో ఇంద్రా, సంతోషం, ఘర్షణ, గుడుంబా శంకర్‌, నేనున్నాను, సైనికుడు తదితర చిత్రాల్లో పాటలు పాడారు. కేకే మృతిపై ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement