Friday, May 3, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 27
27
ప్రకృతే: క్రియమాణాని
గుణౖ: కర్మాణి సర్వశ: |
అహంకారవిమూఢాత్మా
కర్తా2హమితి మన్యతే ||

అర్థము : అహంకారముతో జీవాత్మ, వాస్తవమునకు ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తయని భావించి మోహితుడగును.

భాష్యము : భగవంతుని అధీనములో ఉండే భౌతిక ప్రకృతి ద్వారా మనము ఈ శరీరాన్ని, మనస్సు, బుద్ధి, అహంకారాన్ని పొందాము. తద్వారా జీవుడు భగవంతుని ఆధీనంలోనే ఉంటాడు. అయితే ఎంతోకాలముగా ఇంద్రియ భోగములో మునిగి ఉన్న జీవాత్మ మిధ్యా అహంకారముతో, భగవంతుడు, హృషీకేశుడు ఇంద్రియాలకు ప్రభువని మరచి తన కార్యాలకు తానే కారకుడనని, స్వతంత్రుడనని భావిస్తూ, తనకు కృష్ణునితో గల శాశ్వత సంబంధాన్ని మరచిపోతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement