Thursday, May 16, 2024

ప్రాణం తీసిన పొరపాటు.. జూనియర్ ఆర్టిస్ట్ మృతి…ఏం జరిగిందంటే..

ఒక చిన్న పొరపాటుతో జూనియర్ ఆర్టిస్టు ప్రాణం పోయింది. నిద్ర మత్తులో రైలు దిగి.. మళ్లీ మళ్లీ రైలు ఎక్కేందుకు ప్రయత్నించి తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే జూనియర్ ఆర్టిస్టుగానూ పనిచేస్తోంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లింది. సోమవారం (జనవరి 17) రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి హైదరాబాద్ పయనమమైంది. రైలు మంగళవారం తెల్లవారుజామున 5.30 గం. సమయంలో షాద్ నగర్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతిరెడ్డి కాచిగూడ స్టేషన్‌గా పొరబడి కిందకు దిగిపోయింది. తర్వాత అది కాచిగూడ స్టేషన్‌ కాదని తెలుసుకుని మళ్లీ రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది.

అయితే, కదులుతున్న రైల్లోకి ఎక్కేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పి ప్లాట్‌ఫామ్‌పై పడిపోయింది. ఈ ప్రమాదంలో జ్యోతిరెడ్డి తలకు బలమైన గాయమైంది. వెంటనే రైల్వే సిబ్బంది ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి మృతిపై సరైన విచారణ జరిపించాలని ఆమె బంధువులు, స్నేహితులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement