Saturday, April 27, 2024

సాయి ప్రణీత్ ఔట్.. ఇంటి ముఖం పట్టిన తెలుగు తేజం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ సాయి ప్రణీత్ జర్నీ బుధవారం ముగిసింది. భారీ అంచనాల నడుమ ఈ మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన సాయి ప్రణీత్.. గ్రూప్ స్టేజ్‌లోనే వరుస ఓటములతో ఇంటిముఖం పట్టాడు. కెరీర్‌లో తొలిసారి ఒలింపిక్స్‌ ఆడిన ఈ 28 ఏళ్ల షట్లర్.. తన కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న షట్లర్ల చేతిలో ఓడిపోవడం గమనార్హం. పురుషుల సింగిల్స్‌ లో భాగంగా బుధవారం గ్రూప్-డిలో నెదర్లాండ్స్‌కి చెందిన మార్క్‌తో సాయి ప్రణీత్ తలపడ్డాడు. అయితే, కీలకమైన ఈ మ్యాచ్‌లో రెండు సెట్లలోనూ ప్రణీత్ తడబడ్డాడు. తొలి సెట్‌ని 14-21తో చేజార్చుకున్న ప్రణీత్.. రెండో సెట్‌లోనూ 14-21తో ఓటమిపాలైయ్యాడు.

కాగా, 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుపొందిన సాయి ప్రణీత్.. ఒలింపిక్స్‌లో అడుగపెట్టే సమయానికి 15వ ర్యాంక్‌లో ఉన్నాడు. దీంతో సాయి ప్రణీత్ కచ్చితంగా పతకం గెలుస్తాడని అభిమానులు భావించారు. అయితే, ఫస్ట్ మ్యాచ్‌లోనే ఇజ్రాయెల్‌కి చెందిన మిశా జిబ్రామెన్‌ చేతిలో 17-21, 15-21 తేడాతో ఓడిపోయాడు. తాజాగా మార్క్ చేతిలో ఓడిపోయాడు.

ఇది కూడా చదవండి: వేల కోట్లతో దళితబంధు అమలు చేస్తామంటే నమ్మాలా?

Advertisement

తాజా వార్తలు

Advertisement