Sunday, May 19, 2024

కృష్ణంరాజు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ ప్ర‌భాస్ సోద‌రుడు.. కొద్దిసేప‌ట్లో అంతిమ‌యాత్ర‌!

సినీ న‌టుడు, రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. ఇవ్వాల (సోమ‌వారం) ఆయ‌న అంత్యక్రియలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొయినాబాద్ సమీపంలోని కనకమామిడిలో ఉన్న ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు.

కాగా, సినీ నటుడు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం కృష్ణంరాజు భౌతికకాయం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద ఉంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను కడసారి చూసుకుని, నివాళి అర్పిస్తున్నారు.

మరికొద్దిసేపట్లో కృష్ణంరాజు భౌతికకాయాన్ని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియానికి తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ కొంత సమయం ఉంచనున్నారు. అనంతరం అక్కడినుంచి రెబల్‌స్టార్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement