Sunday, November 28, 2021

బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ విలేజ్ గా పోచంపల్లి.. చేనేతకే ఇంపార్టెన్స్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

వ్యవసాయ రంగం తర్వాత అత్యదికంగా ఆదారపడింది చేనేత రంగంపైనే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ విలేజ్ గా పోచంపల్లిని ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈరోజు (సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. నేతన్నల కు గౌరవం ఇచ్చేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  పోచంపల్లి కి అవార్డు.. రామప్ప కు యునెస్కో గుర్తింపు.. అయోధ్య నుంచి18 రోజు లు ప్రయాణించి భద్రాద్రి కి రైలు తీసుకుని వచ్చామన్నారు కేంద్ర మంత్రి.శ్రీరామ సర్క్యఃట్ ను భద్రాద్రి వరకు తీసుకుని రావడం లో విజయం సాధించిచనట్టు తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..

పదిలక్షల మంది ఎస్సీ విద్యార్థుల స్కాలర్ షిప్స్ వారి అకౌంట్స్ లో జమచేస్తాం. అంబెద్కర్ జన్మస్థలం.. దీక్షా స్థలం.. చనిపోయిన..  చదువు కున్న.. లండన్ లో ఆయన నివాసం ఉన్న ప్రాంతాలను పంచతీర్థ లను ఆన్లైన్ లో చూపెడతాం. అంబేద్కర్ జయంతి రోజున ఈ కార్యక్రమం ఉంటుంది. జనవరి 23బోసు జన్మదినం సందర్భంగా ఢిల్లీ లో ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నాం. బోసు జీవిత చరిత్ర ప్రజలకు తెలిసేలా చర్యలు చేపట్టాం. పొంగల్.. సంక్రాంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ముగ్గుల పోటీ నిర్వహిస్తాం. అని వివరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఈ సాంప్రదాయం అనేక రాష్ట్రాల్లో ఉంది..  అందుకే జిల్లా.. రాష్ట్ర.. జాతీయ స్థాయిలో కాంపిటీషన్ ఏర్పాటు చేసాం. దేశభక్తి తో కూడిన పాటల పోటీలు నిర్వహిస్తాం. ఆన్లైన్ ధ్వారా ఈ కాంపిటీషన్ ఉంటుంది. స్థానిక భాషలలో ఈ కాంపిటీషన్ లు ఉంటాయి. లక్షా… డైబ్బై ఐదు .. యాభై వేలు ప్రైజ్ మనీ ఇస్తాం. హుజూరాబాద్ ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వం. టీఆర్ఎస్ పార్టీ పూర్తి శక్తి ని కేంద్రీకరించారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినా టీఆర్ఎస్ ఘోరపరాజయం చవి చూసింది. హుజూరాబాద్ కోసమే ప్లీనరీ పెట్టి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేసారు. పార్టీ ల నాయకుల కు కూడా వేల కోట్లు ఇచ్చి సంతలో పశువులను కొన్నట్టు కొనే ప్రయత్నం చేసారు. ఆఘమేఘాల మీద ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అన్ని ప్రయత్నాలు చేసారు. పావులా వడ్డీ లు ఒక్క హుజూరాబాద్ లోనే ఇచ్చారు. రాష్ట్ర సచివాలయం హుజూరాబాద్ లో ఉందా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. అని తెలిపారు.

కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉండి స్వయంగా విలేజ్ వైజ్ మానీటర్ చేసారు. బెదిరింపు లు.. అధికార పార్టీ దే గెలుపు.. మాకు ఓటమి లేదు… నిజాం తరహాలో పాలిస్తా అనుకుంటున్నారు. దళితులు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందదు అన్నట్లు మాట్లాడారు. దళితులకు ముఖ్యమంత్రి కి అరహత లేదా. సమర్దత లేదనేదే ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు అర్థమా. ఇన్ని చేసినా ఎన్నికల్లో ఓడిపోయిన దాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. దాన్ని మరిపించే ప్రయత్నం చేస్తున్నారు… విజయ ఘర్జన సభ పెడతామంటూ ప్రకటించారు. జబ్బులు చరచుకొని విర్రవీగి.. అధికార దుర్వినియోగం చేసి అక్కడ చతికిల పడ్డారు. దాని పై నుంచి దృష్టి మరల్చేందుకు కొత్త నాటకం ఆడుతున్నారు. ఇన్ని రోజులు నేనే కొంటున్నాం అని చెప్పి.. హుజూరాబాద్ ఓటమి తరువాత కేంద్ర ప్రభుత్వం కొనడం లేదని బదనాం చేస్తున్నారు. సమస్య లేని సమస్య ను ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారు. అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News