Saturday, April 27, 2024

పెట్రో మంటలు.. మళ్లీ పెరిగిన ధరలు

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. గురువారం లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 7 పైసల వరకు పెంచాయి. ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.76, డీజిల్‌ రూ.88.30కి పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్‌ రూ.103.89కు చేరింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109కి చేరువైంది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.108.94, డీజిల్‌ రూ.101.48 పలుకుతోంది. ఇప్పటి వరకు మే 4 తర్వాత నుంచి ఇప్పటి వరకు 30 సార్లు ధరలు పెరగ్గా.. లీటర్‌ పెట్రోల్‌పై రూ.7.44, డీజిల్‌పై రూ.7.52 పెరిగింది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు డాలర్‌కు 75 డాలర్ల మార్క్‌ను దాటింది. గత రెండేళ్లలో బ్రెంట్‌ ముడి ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. యూఎస్‌ క్రూడ్‌ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.38 డాలర్లు పెరిగి.. 75.19 డాలర్లకు చెరింది. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ 0.18 డాలర్లు పెరిగి.. 73.26 వద్ద ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement