Monday, April 29, 2024

కమల్ ఎన్నికల హామీ..


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. తాజాగా సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. 50 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఎంఎన్ఎం మేనిఫెస్టోలో కమల్ తెలిపారు. అలాగే, యువ వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గృహిణులకు వారి నైపుణ్యాల అభివృద్ధితో నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 సంపాదించే అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement